17, ఆగస్టు 2009, సోమవారం

"ఉప్పు నుంచి శక్తి"

నేచర్ ౪౬౦, ౭౮౨ ( ౧౩ ఆగస్టు ౨౦౦౯)

స్వచమైన నీటితో లవణం అధికంగా ఉన్న నీటిని కలపటం వలన మానవ అవసరాలకు పనికివచ్చే ఉష్ణ శక్తిని పుట్టించవచ్చు. అయితే, అలా పుట్టిన శక్తిని రూపంలో ఎలా భద్రపరచాలన్నది ప్రస్తుతం శాస్త్రవేత్తలని తొలచివేస్తున్న విషయం. దీనికి చక్కటి పరిష్కారం తో దొరిఅనో బ్రోగిఒలి అనే ఇటలీలో మిలన్ -బికచ్కా విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ఒక నమూనాని ప్రదర్శించారు.

నమునాలో కార్బన్ ఎలక్ట్రోడ్ (విద్యుత్ దండం) ని ముందుగా ఉప్పునీటితో చర్య వలన విద్యుతావేసం వచ్చేవరకు ఉంచి, తరవాత ఉప్పునీటిని తొలగించి స్వచమైన నీటితో నింపవలెను. దీనివలన ఎలక్ట్రోడ్స్ నుంచి దూరంగా వెళ్ళే ఉప్పు అణు సకలాల (ఐయానుల) వలన, ఎలక్ట్రోడ్స్ మద్యలో పీడన తారతమ్యం పెరగటం వలన, వాటికి అనుసంధాన పరచిన విద్యుత్ వలయంలో రసాయన శక్తీగా భద్రపరచవచ్చు.

1 కామెంట్‌: