శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, తెలుగులో అది లభించటం చాలా అరుదు. కారణం- మన మాతృభాషలో శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలనే ఆకాంక్ష మనలో లోపించటం. ప్రస్తుత సమాజంలో ఎక్కువ సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉన్నతవిద్యను పొందగలగటం, విజ్ఞానశాస్త్ర రంగాలలో తమ ఉనికిని చాటిచెప్పటం అభినందనీయం. అయితే, ఎప్పుడైతే మనిషి అభ్యున్నతికి, ముందుతరాలవారికి ఉపయోగపడే శాస్త్రీయ సంపదని బాష తనలో దాచుకోలేదో, అప్పటినుంచి ఆ భాష శిథిలమవుతున్నట్టే. ఈ పరిస్థితుల్లో ఆదునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించగల భాష మాత్రమే మనుగడ నిలుపుకోగలుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. శాస్త్ర విజ్ఞానం మానవజాతికన్తటికి అందుబాటులో ఉండేట్టుగా ఆంగ్లంలో ప్రచురించబడటం సమంజసమే అయినా, మిగిలిన భాషలలో ఆ విజ్ఞానాన్ని అందించటం ఆయా భాషలు మాతృభాషలుగా ఉన్న విద్యావేత్తలు భాద్యతగా భావించాలి. పాశ్చాత్య దేశాలతో పాటు మనకి అన్నిటిలో పోటీగా నిలుస్తున్న చైనా కూడా దీనిని సమర్దంగా నిర్వహించటం గమనించతగ్గ విషయం. అయితే ఆయా దేశాలలో విశ్వ విద్యాలయాలల్లో ఉన్నత విద్యా-పరిశోధనలు వారి భాషల్లోనే జరగటం, కనిపెట్టిన విషయాలని వారి భాషల్లోనే మొదటగా ప్రచురించటం, ఆయా భాషాసంపదని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తున్నాయి. ఈవిధంగా విద్యా బోధన, పరిశోధన మరియు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించని భాషలు ఉనికిని కోల్పోవటం సహజం.
మన దేశంలో తెలుగుతో పాటు ఎన్నో భాషలు ఇలాంటి దయనీయ స్థితిలో ఉండటానికి పైన చెప్పిన కారణాలు తక్కువనే చెప్పొచ్చు. అయితే, తెలుగుపై మన భాషాభిమానాన్ని చాటేందుకు తెలుగుకి ప్రాచీన భాషగా గుర్తింపు రావటానికి కారణమైన మహానుభావుల్ని స్మరించుకోని గర్వంగా నిట్టూర్చితే సరిపడదు. ప్రతి తెలుగువాడు వాళ్ళ వాళ్ళ రంగాల్లో తెలుగుతల్లి మూగబోకుండా తమవంతు కృషి చేసినప్పుడే దానికి సార్ధకత. అప్పుడే తెలుగుతల్లి తన బిడ్డలకి జ్ఞానామృత క్షీరదారని అందించగలదు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా తెలుగుతల్లి గౌరవాన్ని నిలిపే తెలుగుజాతి ఉద్బవించగలదు.
ఇందులో నావొంతు ప్రయత్నంగా "నేచర్" లో ప్రచురించే సమకాలీన శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగులో శక్తికొలది అందిచే ప్రయత్నం ఈ " అణు ధర్శని" కూడలి. తెలుగులో మాట్లాడటానికే సంకోచించే ప్రస్తుత సమాజంలో, ఈ కూడలి తెలుగు తల్లికి మల్లెపూదండ కాకపోయినా, పాదాలపై ఒక చల్లని మంచుబిందువు కాకపోవునా అని ఆకాంక్షిస్తూ.....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి