మన దేశంలో రైతులు ఎదురుకొనే సమస్యలలో ఒకటి వరద తాకిడకి పంటని కోల్పోవటం. ఇది కేవలం మన దేశంలో రైతుల సమస్యే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల ఆహరోత్పతిని దెబ్బతీస్తున్న సమస్య. అందునా వరి పంట నీటిలో పూర్తిగా మునిగి, రెండు మూడు రోజులకే చనిపోతుంది. జపాన్ ఈసమస్యకు శాశ్వత పరిష్కారంగా, వరదని తట్టుకొనే ఆహారధాన్యాల ఉత్పత్తి చెయ్యగలిగే పరిశోదనలను ప్రోత్సహించింది. దీని ఫలితంగా, నగోయ విశ్వవిద్యాలయానికి చెందిన మొతోయుకి ఆశికారి బృందం వరద సమయంలో పంట పూర్తిగా నీట మునిగినప్పుడు కాండం ఎదుగుదల నీటి మట్టానికి పైకి రావటానికి ఉత్పేర పరచే జన్యువులను కనుగొన్నారు. వీటిని స్నోర్కెల్ ౧, స్నొర్కెల౨ గా పేర్కొన్నారు. ఈ రెండు జన్యువుల సంయుక్త చర్య వలన ఆహారధాన్యాలు ఇచ్చే మొక్కలు నీటి మట్టానికి తగ్గట్టుగా ఎనిమిది మీటర్లు వరకు పెరుగుదల చూపుతున్నట్టు వీరి పరిశోధనలో తేలింది.
ఇక శాస్త్రీయ ప్రమాణాలకు వెళితే, "స్నోర్కెల్ ౧" మరియు "స్నోర్కెల్ ౨" అన్న జన్యువులు కేవలం ఇథిలీన్ అనే రసాయనం మొక్కలో ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడే వాటి ఎదుగుదలని ప్రేరేపిస్తాయి. వరి మొక్కలలో ఇథిలీన్ శాతం కేవలం నీటిలో ఎక్కువ శాతం మునిగినప్పుడే ఉత్పతి కావటం వలన, వరద లేని సమయంలో వరి మొక్కలలో ఈ జన్యు మార్పిడి ఎలాంటి ప్రభావం చూపించదు.
ఇది ఇలా ఉండగా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన వేరొక పరిశోధనా బృందం వరద నీటిలో పూర్తిగా మునిగినా, జపాన్ పరిశోధనా బృందం చెప్పినట్టుగా మొక్క నీతిమట్టానికి పైకి ఎదిగే అవసరం లేకుండానే బ్రతకగలిగే వరి మొక్కలని జన్యు మార్పిడి ద్యారా కనుగొన్నారు. దీనికి ఉపయోగ పడే జన్యువును "సబ్ ౧ ఎ" గా పేర్కొన్నారు. ఈ బృందానికే చెందిన పమేలా రోనాల్డ్ మనదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న స్వర్ణ జాతికి చెందిన వరి మొక్కల మీద కూడా ఈ పరిశోధనలు చేసి విజయం సాదించినట్టు "నేచర్ " లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి