ఆగస్టు ౨౨ న లండన్లో జరిగిన "సైన్స్ ఆన్లైన్" శాస్త్రవేత్తల సమావేశంలో ఇంటర్నెట్ విజ్ఞానశాస్త్ర అభివృద్దికి, శాస్త్ర విజ్ఞాన పరస్పరోపయోగానికి ఎంత వరకు దోహద పడుతుంది అన్న అంశం మీద చర్చించారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కామెరాన్ నెయ్లోన్ అనే జీవరసాయన శాస్త్రవేత్త, " గూగుల్ వేవ్" శాస్త్రీయ సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావోచ్చో వివరించారు.
గూగుల్ వేవ్ శాస్త్రవేత్తలకి అనుకూలంగా ఉండే అనేక ఉపకరణాలతో రూపుదిద్దుకుంది. ముఖ్యంగా, వేరు వేరు ప్రాంతాలలో పరిశోధన చెస్తున్నప్పుడు సమాచారాన్ని, పరిశోధనా అంశాలని ఒకే సమయంలో అన్ని చోట్లా అందుబాటులో ఉండేట్టు చెయ్యవచ్చు. దీనితోపాటు, ఇందులో అనుసంధాన పరచిన కొన్ని స్వయంచాలక ( ఆటో మీటేడ్) ఉపకరణాలు పరిశోధనా అంశాల ప్రచురణాప్రతులు రాయటాన్ని ఎంతో సులభతరం చేస్తాయి. ఐతే, గూగుల్ వేవ్ ని నిజంగా శాస్త్రవేత్తలకి ఉపయోగకరంగా రూపుదిద్దలంటే, ప్రస్తుతం వాళ్లు ఎదురుకొనే ముఖ్యమైన సమస్యల పరిష్కరాల్ని పొందుపరచాలని డా,, కామెరాన్ నెయ్లోన్ పేర్కొన్నారు.

Bagundi!!! Inka regular ga rastu undu
రిప్లయితొలగించండి